గ్రేటర్ నోయిడాలోని రబూపురా ప్రాంతం నాగ్లా శ్రీ పదమ్ గ్రామానికి చెందిన మహేశ్ (37), ఆయన భార్య లలిత (35), వారి ముగ్గురు పిల్లలతో కలిస జీవిస్తున్నారు. గత రాత్రి దంపతలు తన ముగ్గురు పిల్లలతో కలిసి నూడుల్స్ తినడంతో పాటు టీ తాగారని మహేష్ తల్లి తెలిపారు. తెల్లవారుజామున లేచేసేరకి ఐదుగురు చనిపోయి కనిపించారు. వారు తిన్న ఆహారం కలుషితమైందా? ఏదైనా విషపదార్థం ప్రభావం చూపిందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.