రాజస్థాన్లోని కోటా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ–ముంబై ఎక్స్ప్రెస్వేపై భక్తులతో వెళ్తున్న ఓ బస్సు బోల్తా పడటంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి రాజస్థాన్లోని ప్రసిద్ధ ఖాటు శ్యామ్ ఆలయానికి భక్తులు బస్సులో బయలుదేరారు. బస్సులో వృద్ధులు, చిన్నారులు సహా మొత్తం 21 మంది ప్రయాణిస్తున్నారు.