టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘నీలో ఫన్ లేదు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఆ స్థానానికి మళ్లీ నువ్వు వెళ్లలేవు’ అని పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె వ్యాఖ్యలు నెట్టింట చర్చకు దారి తీశాయి. ఇదిలా ఉండగా మరో పోస్ట్లో ‘‘తన భార్యను కోమాలోకి వెళ్లేలా కొట్టిన వ్యక్తిని టాలీవుడ్ ఇండస్ట్రీలో గురూజీ అని పిలుస్తున్నారు’’ అని పేర్కొంది. కాగా, పూనమ్ తన పోస్టులో నేరుగా పేరు వెల్లడించకపోవడంతో ఆమె వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించాయన్నది. స్పష్టత రావాల్సి ఉంది.