విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పర్యటనలో భాగంగా గురువారం నగరంలో ‘జాతీయ సరస్ మేళా’ను రాష్ట్రపతి లాంఛనంగా ప్రారంభించారు. సరస్ మేళా కార్యక్రమం ముగిసిన వెంటనే రాష్ట్రపతి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఇండియన్ డిఫెన్స్కు చెందిన స్పెషల్ ఫ్లైట్లో ఆమె ఢిల్లీకి పయనమయ్యారు. గన్నవరం ఎయిర్పోర్టులో రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి వంగలపూడి అనిత ఘన వీడ్కోలు పలికారు.