ఏపీ ప్రభుత్వం మండల స్థాయిలో మండల స్వర్ణ గ్రామం అధికారులు, పట్టణ స్థాయిలో అర్బన్ స్వర్ణ వార్డు అధికారులు తమ పరిధిలోని స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులకు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు (DDOs)గా వ్యవహరించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాలు, నగరాల్లో మున్సిపల్ కమిషనర్లు డీడీవోలుగా వ్యవహరిస్తున్నారు. వీరి స్ధానంలో స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ అధికారులకే ఆ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ జీఓ జారీ చేసింది.