అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని, అక్రమ భూ కబ్జాలు, దౌర్జన్యపు బెదిరింపులతో సామాన్య ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేసిన ‘లేడీ డాన్’ కోనేటి సులోచన ఆటలకు బ్రేక్ పడింది. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈమెను పోలీసులు ఇవాళ ఉదయం పక్కా వ్యూహంతో అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని నీరుగట్టుపల్లి ప్రాంతానికి చెందిన సులోచన పేరు వింటేనే బెంబేలెత్తే పరిస్థితి అక్కడ నెలకొంది. మదనపల్లె పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు 14 వరకు చీటింగ్ కేసులు ఆమెపై నమోదై ఉన్నాయి.