కృష్ణా తీరాన సరస్ మేళాతో ఎపికి మరింత శోభ తెచ్చిందని ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. మహిళలను శక్తి స్వరూపులుగా చూసే పుణ్యభూమి మనదేశం, రాష్ట్రపతి ముర్ము జీవితం..ప్రతి ఆడబిడ్డకు ఒక సందేశమని, మారుమూల ప్రాంతంలో పుట్టి ప్రజాసేవలో ఒక్కో మెట్టు ఎక్కారని కొనియాడారు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా ధైర్యాన్ని కోల్పోలేదని అన్నారు. మహిళలకు సంకల్పం ఉంటే ఎలాంటి ఉన్నత శిఖరాలైనా అధిరోహిస్తారని నిరూపించారని, ఇది నారీ శక్తి..ఇది నవభారత్ శక్తి..ఇదే వికసిత్ భారత్ కు పునాది అని చంద్రబాబు ప్రశంసించారు.