ఒక్క అధికారి కోసం దేశ రాజధానిని పూర్తిగా స్తంభింపజేసిందని అభిజిత్ దిప్కే ఆరోపించారు. ఢిల్లీని భారత్-పాకిస్తాన్ సరిహద్దులా మార్చేసిందని ధ్వజమెత్తారు. సామాన్య ప్రజల పట్ల కనీస జాలి, దయ లేకుండా వ్యవహరిస్తోందని, వాహనాల రాకపోకలను అడ్డుకుంటోందని మండిపడ్డారు. విద్యార్థులను రోడ్లపై ఈడ్చుకెళ్లడం ప్రభుత్వ అణచివేత ధోరణికి నిదర్శనమని విమర్శించారు. రెండు వారాలుగా ఢిల్లీ వీధుల్లో విద్యార్థి సంఘాలు, యువత తమ ఆకాంక్షల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారని, అయినా కేంద్ర ప్రభుత్వంలో కనీస చలనం రావట్లేదని విమర్శించారు.