ఇరాన్ వ్యూహాత్మక ప్రదేశాలపై విరుచుకుపడటానికి నూతన ప్రణాళికలను రూపకల్పన చేస్తోంది. ఇరాన్లోని అణు, ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని తమ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ (MOAB)ను ఉపయోగించే ప్రతిపాదనను పెంటగాన్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత విధ్వంసకరమైన జీబీయూ-43/బీ రకానికి చెందిన బాంబు ఇది. అణ్వేతర ఆయుధం ఇది. నాన్ న్యూక్లియర్ కేటగిరీలో మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ గా పిలుస్తారు దీన్ని. వైట్హౌస్.. మిలిటరీ అధికారులు ముందస్తు సన్నాహాలు చేశారు కూడా