విజయవాడలో విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో, దేవీ శరన్నవరాత్రుల శుభవేళ స్వయం సహాయక సంఘాల జాతీయ సరస్ మేళా–2026 అత్యంత వైభవంగా ప్రారంభమైంది. కార్యక్రమంలో మాట్లాడిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, మహిళలను ఇకపై కేవలం లఖ్పతి దీదీలుగానే కాకుండా కరోడ్పతి దీదీలు గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలి. స్వయం సహాయక సంఘాల ద్వారా దేశవ్యాప్తంగా మహిళల్లో అద్భుతమైన ఆర్థిక, సామాజిక చైతన్యం వచ్చింది. వికసిత్ భారత్ సాధనలో మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకం అని రాష్ట్రపతి స్పష్టం చేశారు.