అమెరికాలో ఇల్లినోయీలో హిందూ ఆలయంపై కాల్పుల కుట్ర కేసులో 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.భారతీయులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపే ఉద్దేశంతో అతడు ఆలయానికి వెళ్లినట్లు అయితే, రైఫిల్ జామ్ అవడంతో అతడి కుట్ర విఫలమైనట్లు పేర్కొన్నారు. జామ్ అయిన తుపాకీని ఎలా సరిచేయాలన్న దానిపై ఇంటర్నెట్లో శోధించినట్లు సమాచారం. ఓ ఫ్రెండ్ కు ఫోన్ చేసి కాల్పులు జరపాలనుకున్న విషయాన్ని, తుపాకీ జామ్ అయిన సంగతిని చెప్పాడు. దీంతో నిందితుడి స్నేహితుడు ఆందోళనకు గురై పోలీసులకు సమాచారమిచ్చాడు.