కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజంపై 11 మంది విద్యార్థినులు చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదులపై బీజేపీ
ఎంపీ బన్సూరీ స్వరాజ్ స్పందించారు. జెఎన్ యూలో ఫిర్యాదులపై అంతర్గత కమిటీ ఏర్పాటైందని, అక్టోబర్ 9న అకోయిజంను ఆయన యూనివర్సిటీ పదవి నుంచి తొలగించినట్లు వార్తలు వచ్చాయని తెలిపారు. ఆరోపణలపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మహిళల హక్కుల గురించి మాట్లాడే కాంగ్రెస్, రాహుల్ గాంధీ తన పార్టీ ఎంపీపై వచ్చిన ఆరోపణల విషయంలోనూ బాధ్యత వహించాలని బన్సూరీ స్వరాజ్ డిమాండ్ చేశారు.