బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా యూట్యూబ్లోకి అడుగు పెట్టారు. ‘బీయింగ్ సల్మాన్ ఖాన్’ పేరుతతో ఆయన ఛానెల్ తెలిచారు. ఈ మేరకు ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. ‘‘నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలు. అందులోని కంటెంట్ మీకు అంతగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే.. అది మీ కోసం కాదు, మీ ఇంట్లోని చిన్నపిల్లల కోసం మాత్రమే. వినోదం, ప్రేమ, కుటుంబ బంధాలతో పాటు పిల్లలకు విద్య కూడా ఎంతో అవసరం కదా’’ అని సల్మాన్ రాసుకొచ్చారు.