దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు భారీ సంఖ్యలో యువతీయువకులు తరలివస్తుండగా శనివారం సాయంత్రం నాటికి దాదాపు 7 వేల మందికి పైగా నిరసనకారులను పోలీసులు నిర్బంధించినట్లు సమాచారం అయితే దేశంలో జరుగుతున్న అక్రమ నిర్బంధాలపై యూనైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిటీ(UNHRC) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వారిని శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అలాగే నిర్బంధంలో ఉన్న నిరసనకారులను తక్షణమే విడుదల చేయాలని స్పష్టం చేసింది.