సౌదీ అరేబియాలోని రియాద్ ఎయిర్ పోర్టుపై హూతీలు మళ్లీ విరుచుకుపడ్డారు. ప్రయాణికుల టర్మినల్ పై జరిగిన క్షిపణి దాడిలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానాశ్రయం మొత్తాన్ని ఖాళీ చేయించారు. విమాన కార్యకలాపాలను నిలిపివేసినట్లు వెల్లడించారు. ఎయిర్ పోర్ట్ కు బయలుదేరే ముందు ప్రయాణికులు
తమ విమాన సమాచారం గురించి సంబంధిత సంస్థతో సరి చూసుకోవాలని సూచిస్తూ అడ్వైజరీ జారీ చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన దాడిలో ఓ పైలట్ సహా ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే.