ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోకు భారీ షాక్ తగిలింది. జాతీయ జట్టును వీడిన వ్యవహారంలో పోర్చుగల్ ఫుట్‌బాల్ సమాఖ్య అతడిపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించింది. తుది నిర్ణయం వెలువడే వరకు రొనాల్డోపై తాత్కాలిక సస్పెన్షన్ విధించినట్లు ప్రకటించింది. అక్టోబర్ 1న డెన్మార్క్‌తో మ్యాచ్‌లోనూ తుది జట్టులో చోటు దక్కదని తెలియడంతో అతడు జాతీయ జట్టును వీడాడు. ఈ వ్యవహారమే తాజా వివాదానికి కారణమైంది. జట్టుకు దూరమయ్యే ఆలోచన లేదని సమాఖ్య విధించే శిక్షను స్వీకరించేందుకు సిద్ధమని రొనాల్డో తెలిపాడు.