ఢిల్లీలో విద్యార్థి నాయకులు, కార్యకర్తలను పోలీసులు నిర్బంధించడాన్ని ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్చాక్ శనివారం తీవ్రంగా ఖండించారు. ఇది దేశంలో ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ లాంటిది అని ఆయన అభివర్ణించారు. అరెస్టయిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. లేనిపక్షంలో తాను మరోసారి ఆమరణ నిరాహార దీక్ష లేదంటే పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. అరెస్టయిన వారందరూ త్వరలోనే విడుదలవుతారని నేను ఆశిస్తున్నాను.