అమెరికా పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఈరీ నగరంలో ఓ ఇంటి వద్ద దుండగుడు జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, గర్భిణి ఉన్నారు. ఈ ఘటన అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. దుండగుడు ఇంటి బయట ఇద్దరు మహిళలను కాల్చి చంపి.. తర్వాత లోనికి వెళ్లి పలువురిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పులకు పాల్పడటానికి గల కారణాలు తెలియరాలేదు.