చంద్రబాబు బీసీలకు క్షమాపణ చెప్పాలన్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. రిజర్వేషన్ల పేరుతో మోసం చేయటంపై మండిపడ్డారు. ‘‘స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ మీరు నమ్మించి వంచించారని సాక్షాత్తూ సుప్రీంకోర్టు సాక్షిగా నిర్ధారణ అయింది. మీరు పెద్ద మోసకారని మరోసారి తేలిపోయింది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. చివరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్టు మీరు మభ్యపెట్టింది కూడా ఒక ఘరానా మోసమే. చంద్రబాబూ.. ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.