మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో కాళ్లకు గొలుసులతో నూతన వధూవరులు ఓ నదిలో శవాలుగా తేలారు. మృతులను అమల్నేర్ తాలూకాలోని పడల్సారే గ్రామానికి చెందిన దంపతులు శ్యామ్ హరి పాటిల్ (28), సప్నా శ్యామ్ పాటిల్ (20)గా గుర్తించారు. కొన్ని నెలల క్రితమే వారు ప్రేమ వివాహం చేసుకొని, ఉట్రాన్ గ్రామంలో నివసిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. పారిపోకుండా ఉండేందుకే ఎవరైనా ఈ జంట కాళ్లకు గొలుసు కట్టి నదిలో తోసేశారా? లేదా వారే ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.