జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, బీహార్ ఎమ్మెల్యే ప్రశాంత్ కిషోర్ సీఈసీ జ్ఞానేష్ కుమార్ వివాదంపై స్పందించారు.జ్ఞానేష్ కుమార్కు ముందు రాజీవ్ కుమార్ ఉండేవారని, ఆయన కూడా ఎన్నికల సంఘాన్ని దాదాపు ఇదే పద్ధతిలో నడిపారని పీకే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పదవీ విరమణ తర్వాత, దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు అయిన హెచ్డిఎఫ్సికి ఛైర్మన్గా నియమితులయ్యారని గుర్తుచేశారు. కాబట్టి, ఎన్నికల సంఘం యొక్క ప్రతిష్ట, విశ్వసనీయత ప్రమాదంలో ఉన్నాయన్నారు.

