స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేశ్ మరోసారి స్పష్టం చేశారు. గురువారం ఎన్టీఆర్ భవన్లో ప్రజల వినతులు స్వీకరించిన తర్వాత మీడియాతో ఇష్టాగోష్టిలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో మేము పూర్తి స్పష్టతతో ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా పార్టీ పరంగా 34 శాతం స్థానాలను బీసీలకు ఇచ్చి తీరుతాం. తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక’’ అని లోకేశ్ అన్నారు.