ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 3 గంటల పాటు సాగిన కేబినెట్ భేటీలో 12 అజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. ‘తల్లికి వందనం’కు రూ.10,208 కోట్లు కేటాయించి 68.05 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కల్పించడంతో పాటు..
వసతి గృహాలు, గురుకులాల డైట్ ఛార్జీలను 10 శాతం పెంచినట్లు చెప్పారు. విదేశీ, ప్రైవేట్ వర్సిటీలను ఆకర్షించే ఉన్నత విద్యా విధానం-2026, గిరిజన విద్యార్థులకు ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్, రేపల్లె ఆస్పత్రి విస్తరణ వంటి కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.