భారతీయ యువ గణిత శాస్త్రవేత్త మహేశ్ కక్డేను రామానుజన్ ప్రైజ్ వరించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల యువ గణితశాస్త్రజ్ఞులకు ఈ అవార్డును ఇస్తారు. ప్రస్తుతం మహేశ్ కక్డే ఐఐఎస్సీలో (బెంగళూరు) ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. నంబర్ థియరీలో విశేష కృషి చేసిన ఆయనను ఈ అవార్డు వరించింది. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్, ఇంటర్నేషనల్ మేథమెటికల్ యూనియన్ సంయుక్తంగా ఈ అవార్డును యువ ప్రతిభావంతులకు ప్రదానం చేస్తాయి. ఆల్జీబ్రాయిక్ నంబర్ థియరీలోని పలు సమస్యలకు పరిష్కారం కనుగొన్న కక్డే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

