CEC జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా దిల్లీలో ఇండియా కూటమి ఎంపీలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. జంతర్ మంతర్‌కు ర్యాలీగా వెళ్తున్న ప్రతిపక్ష పార్టీల ఎంపీలను దిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో పోలీసులు తమను ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడంతో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా అక్కడే రోడ్డు మీదే నేలపైనే పడుకొని నిరసన
వ్యక్తం చేశారు. తనను అక్కడి నుంచి లేపేందుకు ప్రయత్నించగా, మహిళా పోలీసులు తనపై దాడి చేశారని, తన శరీరమంతా గోళ్లతో గాయపరిచారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.