ప్రపంచవ్యాప్తంగా చిన్న వయసులో ఊబకాయంతో (Obesity) సమస్యను ఎదుర్కొంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఔషధాల వాడకం, సర్జరీలు కూడా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో వీటి వినియోగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా పదేళ్లలోపు చిన్నారులకు బరువు తగ్గించే ఔషధాలు ఇవ్వవద్దని, అవి మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయనడానికి స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొంది. పదేళ్ల కన్నా ఎక్కువ, యుక్త వయసు పిల్లల కోసమే లైసెన్సు పొందిన ఔషధాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని WHO వెల్లడించింది.