పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ జగన్ హయాంలోనే తాగు, సాగునీటి ప్రాజెక్టుల పనులు దాదాపు పూర్తి కావచ్చాయని వైఎస్సార్‌సీపీ స్పష్టం చేసింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్దేశపూర్వకంగా ఆ పనులను నిలిపివేసి, ఇప్పుడు ఆ ప్రాజెక్టులను తామే చేపట్టినట్లు క్రెడిట్ దక్కించుకోవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని
వైఎస్సార్‌సీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పనుల్లో ఎలాంటి భాగస్వామ్యం లేదా కనీస సహకారం అందించకుండానే, ఇతరులు చేసిన పనులకు క్రెడిట్ తీసుకోవడానికి అసలు సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రశ్నించింది.