రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుర్రిపాలెంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇల్లు అందేలా ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తాయని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ పేర్కొన్నారు.