రాయలసీమ తలరాత మార్చే ఈ ఉద్యాన హబ్ కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సిఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు.మదనపల్లెలో పవన్ మీడియాతో మాట్లాడుతూ.. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో ‘రాయలసీమ ఉద్యానవన హబ్’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని, ఉద్యాన పంటల సాగు విస్తరణ పెంపు, రాయలసీమను నీటిసంరక్షణ రీజియన్ గా తీర్చిదిద్దే చర్యలు చేపట్టామని పవన్ తెలియజేశారు. రాయలసీమలో భూగర్భ జలమట్టాలు సగటున 3.6 మీటర్లు పెరిగాయని, రాయలసీమలో ఉద్యానసాగుకు కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.