ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనకు ఎంతో ఇష్టమైన తాత, ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా అక్టోబర్ 1న తన కొత్త క్రియేటివ్ ఆఫీస్‌ను ప్రారంభించారు. ఈ ప్రత్యేకమైన కార్యాలయానికి ‘ఐకాన్జా’ అనే పేరును పెట్టారు.ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘ఒక సరికొత్త ఆఫీస్.. ఒక సరికొత్త ఆరంభం. మా తాతగారు అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాం’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

