తెలంగాణలోని ఇన్-సర్వీస్ టీచర్లకు విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా రెండో టెట్ (TET) నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన ఇన్-సర్వీస్ టీచర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విద్యాశాఖ సూచించింది. ప్రత్యేక టెట్‌కు అక్టోబర్ 7, 2026 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. అర్హత ఉన్న ఉపాధ్యాయులు అక్టోబర్ 16, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను విద్యాశాఖ నోటిఫికేషన్‌లో వెల్లడించింది.

