సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగుల రెండు డీఏలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎల్ నినోపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులకు సమస్యలు నివేదిస్తామని, సహాయం చేయాలని కోరతామని తెలిపారు. 5,800 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ కోసం టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు, 2 వేల మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ కోసం కూడా టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. వీటితో పాటు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

