హైదరాబాద్ పోలీస్ శాఖలో పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఇందులో భాగంగా నగరంలోని జోన్లు, డివిజన్లు, పోలీస్ స్టేషన్ల పరిధులలో మొత్తం 76 ప్రాంతాలలో కీలక మార్పులు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సనత్ నగర్ తో పాటు మహేశ్వరం, శంషాబాద్ పరిధుల్లో సరిహద్దులను సవరించారు. ఇందులో భాగంగా RGIA పోలీస్ స్టేషన్ పేరును అధికారికంగా శంషాబాద్ పీఎస్ మార్చారు. ట్రాఫిక్ పోలీస్ శాఖ పరిధిలోని జోన్లు, డివిజన్లలో కూడా మార్పులు చేపట్టారు.