ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో ఖాళీ అయిన ఈ స్థానానికి త్వరలోనే ఉపఎన్నిక శంఖారావం మోగుతుందని ఆశావహులు సన్నద్ధమవుతున్న వేళ, కాంగ్రెస్ నాయకురాలు, దివంగత నేత పీజేఆర్ కుమార్తె పి. విజయారెడ్డి వేసిన లీగల్ పిటిషన్ ఎన్నికల ప్రక్రియను ఒక్కసారిగా బ్రేక్ వేసింది. ఈ వివాదం తేలేవరకు ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయవద్దంటూ ఎన్నికల సంఘానికి స్పష్టత రావడంతో నియోజకవర్గ సమరం చట్టపరమైన చిక్కుల్లో పడింది.

