వర్షాకాలం ముగిసి నేటితో శీతాకాలం ప్రారంభమైంది. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది చలి తీవ్రత తక్కువగానే ఉంటుందని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. అక్టోబర్ నెలలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ సీజన్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ విడుదల చేసిన శీతాకాలం ఔట్లుక్లో పేర్కొంది.

