కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల నమోదు కోసం ఇచ్చే ఫామ్ 6 దరఖాస్తుల్లో గతంలో మార్పులు చేసింది. వీటి ప్రకారం తల్లితండ్రులు, వాళ్ల తల్లితండ్రుల పేర్లను కూడా అడిగింది. తద్వారా Form 6 దరఖాస్తుల్ని తిరస్కరించడం సులువుగా మారింది. ఇందులో సాఫ్ట్ వేర్ నిర్వహిస్తున్న టీసీఎస్ పాత్ర ఎంత అన్న అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇందులో ఫామ్ 6లో టీసీఎస్ చేసిన మార్పులకు ఎవరి నుంచి ఆదేశాలు వెళ్లాయి, వాటిని ఎవరు ఆమోదించారంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

