ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన రాకెట్ వ్యవస్థగా పేరుగాంచిన ఎలన్ మస్క్ సారథ్యంలోని ‘స్పేస్‌ఎక్స్’ (SpaceX)మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. మనిషిని చంద్రుడిపైకి, అటుపై మార్స్ పైకి చేరవేయాలనే అత్యంత ప్రతిష్టాత్మక లక్ష్యంతో రూపొందించిన భారీ రాకెట్ ‘స్టార్‌షిప్’ (Starship) తొలిసారి విజయవంతంగా భూకక్ష్యలోకి ప్రవేశించింది.టెక్సాస్‌లోని స్పేస్‌బేస్ నుంచి మొత్తం 124 మీటర్ల ఎత్తు ఉండే ఈ భారీ రాకెట్‌ను 14వ సారి ప్రయోగించగా, ఈసారి ప్రయోగం విజయవంతమైంది.