ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు సుప్రీం కోర్టులో గట్టి షాక్ తగిలింది. దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఆయనపై నమోదైన అనర్హత వేటును సమర్థిస్తూ గతంలో హైకోర్టు వెల్లడించిన ఉత్తర్వులను సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించి, దానం పిటిషన్ ను కొట్టివేసింది.అనర్హత.వేటు పడటంతో ఆయన మళ్లీ ప్రజాక్షేత్రానికి వెళ్లి ఎన్నికలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోర్టు స్పష్టత ఇవ్వడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక ఖరారైంది.