చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన స్వాగతం పలికారు. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బుధవారం వాషింగ్టన్కు చేరుకున్న జిన్‌పింగ్, ఆయన సతీమణి పెంగ్ లియువాన్‌లకు.. స్వాగతం పలకడానికి ట్రంప్ స్వయంగా జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు వెళ్లారు.జిన్‌పింగ్ దంపతులు విమానం నుంచి దిగి వచ్చినప్పుడు… తన భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియాతో కలిసి ట్రంప్ వారికి సాదరంగా స్వాగతం పలికారు. ట్రంప్ ఇలా ఒక విదేశీ నాయకుడికి స్వయంగా స్వాగతం పలకడం చాలా అరుదు.