తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం నేపథ్యంలో డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత దేవికి ఊహించని షాక్ తగిలింది. సుమలత నేతృత్వంలోని ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేస్తూ ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం 11 మంది మాత్రమే సుమలతకు మద్దతు తెలిపారు. రఘు మాస్టర్‌కు ఏకంగా 214 మంది డ్యాన్సర్లు మద్దతు ప్రకటించారు. మెజారిటీ మద్దతు రఘు మాస్టర్ వైపు ఉండటంతో, ఫెడరేషన్ పెద్దలు వెంటనే సుమలత కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్మానించారు.