సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్ల ఎంప్యానెల్‌మెంట్ కోసం రూపొందించిన పాలసీకి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇన్‌ఫ్లుయెన్సర్లు యాప్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తులను పరిశీలించి, వివరాలను వెరిఫై చేసిన అనంతరం అర్హత కలిగిన వారికి ID కార్డులను జారీ చేయనున్నారు. అలాగే, ఇన్‌ఫ్లుయెన్సర్ల కేటగిరీ, రీచ్, పనితీరు తదితర ప్రమాణాల ఆధారంగా వివిధ కేటగిరీలను రూపొందించి, ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారంలో ఇన్‌ఫ్లుయెన్సర్లను భాగస్వామ్యం చేసే విధానానికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

