తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు అల్లూరి జల్లాలో వాగులు ఉప్పొంగాయి. అనంతగిరి మండలం లొంగపర్తి పంచాయతీ ఓనకొండ గ్రామ సమీపంలో ఓ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. డముకు గ్రామానికి బుధవారం సంతకు వెళ్లిన గిరిజనులు వంతెన లేకోవడంతో తీవ్ర ఇబ్బందలు పడ్డారు. ఈ క్రమంలో ఓ చిన్నారిని భుజాలపై ఎత్తుకొని ఓ గిరిజనుడు ప్రమాదకరంగా వాగు దాటాడు. ఏటా వర్షా కాలంలో ఇదే పరిస్థితి ఎదురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత వంతెన నిర్మించాలని కోరుతున్నారు.

