రష్యా- ఉక్రెయిన్ మధ్య కొన్నేళ్లుగా భీకరంగా కొనసాగుతున్న యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాలు త్వరలోనే ఒక ఒప్పందానికి వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల నేపథ్యంలో ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ న్యూయార్క్ నగరంలో సమావేశమయ్యారు. ఈ ద్వైపాక్షిక భేటీలో రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతి స్థాపన, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.