తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మరియు ప్రత్యేక కార్యక్రమాల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాలలో అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాల్లోని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు