వారానికి ఐదు రోజుల పని విధానంతో పాటు పలు డిమాండ్ల పరిష్కారం కోరుతూ బ్యాంకు యూనియన్లు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నాయి. ఆర్థిక శాఖ సూచన మేరకు డిప్యూటీ లేబర్ కమిషనర్ మంగళవారం జరిపిన చర్చలు విఫలం కావడంతో దేశవ్యాప్త సమ్మెకు సన్నద్ధమవుతున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించింది.