హార్ముజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఈ జలసంధిలో దిగ్బంధనాన్ని అమెరికా తొలగిస్తే, అలాగే, సైనిక మోహరింపులను తగ్గిస్తే వారం రోజుల్లో జలసంధిని తెరుస్తామని ఇరాన్ ప్రకటించింది. అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభమై దాదాపు ఏడు నెలలు కావస్తోంది. ఇంతకాలం హార్ముజ్ జలసంధి పూర్తిస్తాయిలో తెరుచుకోలేదు. మధ్యలో కొంతకాలం తెరుచుకున్నా ఆ వెంటనే మళ్లీ జలసంధిని ఇటు ఇరాన్.. అటు అమెరికా దిగ్బంధించాయి.