loader

హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మంగళవారం సాయంత్రం నుంచి నగరవ్యాప్తంగా భారీ వర్షం దంచికొడుతోంది. ముఖ్యంగా సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వాన కురుస్తోంది. జూబ్లీహిల్స్, గోల్కొండ, శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదైంది. అకస్మాత్తుగా కురిసిన ఈ వానతో ఆఫీసుల నుంచి వెళ్లే ఉద్యోగులు ముప్పుతిప్పలు పడ్డారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని నగర ప్రజలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON