తిరుమల అలిపిరి నడకమార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. కొండపైకి గోవింద నామస్మరణ చేస్తూ వెళ్తున్న భక్తులకు చెట్టుపై కూర్చున్న చిరుత కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నడకమార్గంలోని 2,765వ మెట్టు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం 7:45 గంటల సమయంలో నడకమార్గంలో వెళ్తున్న భక్తులు చెట్టుపై చిరుతను గుర్తించారు. వెంటనే అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు అటవీశాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. చిరుతను గుర్తించి అటవీ ప్రాంతం వైపు తరిమివేశారు.