నీళ్లలోనే ఏళ్ల తరబడి గడిపిన పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్కు చెందిన ఇక్బాల్ హుస్సేన్ ఇప్పుడు అందరిలాగానే ఇంట్లో నివసించే విధంగా మారిపోయాడు. ఇన్ని రోజులు అతనికి ముంబైలో వైద్య చికిత్స అందించారు. ట్రీట్మెంట్ ముగిసిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు ఇక్బాల్. ఆయన బరువు తగ్గడం మాత్రమే కాదు.. శరీరంలో ఉన్న మంట కూడా తగ్గింది. అనంత్ అంబానీ పర్యవేక్షణలో రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు.