డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైఎస్సార్సీపీ నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్పోర్ట్స్ కోటా నియామకాలపై అక్రమాలు జరిగాయని తీవ్రంగా ఆరోపిస్తున్న ఆ పార్టీ నేతలు.. శాప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్లారు. పోలీసులు వారికి అడ్డుకున్నారు. బారికేడ్లను దాటి వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు వారిని నిరోధించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలని వైసీపీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జగరడంతో పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేసి వాహనాల్లో తరలించారు.